కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలహాసన్‌ రెడ్డి బదిలీ

కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలహాసన్‌ రెడ్డి బదిలీ అయ్యారు. ఈ మేరకు ఆయనను బదిలీ చేస్తూ ఇవాళ పోలీసుశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాల్సిందిగా కమలహాసన్‌ రెడ్డిని ఆదేశించింది. ఆయన స్థానంలో రామగుండం సీపీగా పనిచేస్తున్న సత్యనారాయణ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నారు. రామగుండం పోలీస్‌ కమిషనర్‌గా రమణకుమార్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది.