కంపని లాంచింగ్ లో భాగంగా గ్రీన్ ల్యాండ్స్ లో అఫీస్ ముందు ఉద్యోగులతో కలిసి గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని తీసుకోని సంతోష్ కుమార్ చేతుల మీదిగా మొక్కను నాటిన కంపెనీ సీఈవో కిషన్ కవికొండలు మరియు గర్రెపల్లి సతీష్, వడుపు శ్రీనివాస్. అనంతరం గ్రీన్ పార్క్ హోటల్ కి విచ్చేసిన ఎంపీ సంతోష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ఎండిఎస్ కంపెనీ లాంచ్ చేశారు.
అనంతరం సీఈవో కిషన్ కవికొండల మాట్లాడుతూ సంతోష్ కుమార్ ఉద్యమాల నుండి సీఎం కేసీఆర్ వెంట ఉంటూ ఈ రోజు బంగారు తెలంగాణ దిశగా తన వంతు పాత్ర వహిస్తూ నిరంతరం కష్టపడుతూ అందరిని చిరునవ్వుతో పలకరిస్తూ కలుపుకెళ్లే సంతోష్ కుమార్ గారి లాంటి యంగ్ లీడర్ గర్రెపల్లి సతీష్ ప్రారంభిస్తున్న ఎండీఎస్ లాంచ్ కి రావడం గొప్ప విషయం అన్నారు.
యూఎస్ లో మరియు ఇండియాలో ఇంజనీరింగ్ & మ్యానిఫేక్చరింగ్ రంగంలో ఎంతో మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ముందుకు సాగుతున్నాము అని అదే విధంగా మరిన్ని ప్రాజెక్ట్స్ చేస్తూ కొద్ది రోజుల్లోనే వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తానని కిషన్ అన్నారు.
డిజిటల్ మార్కటింగ్ & సోషల్ మీడియా రంగంలో ఎంతో అనుభవం ఉన్న గర్రెపల్లి సతీష్ ఎండీఎస్ ప్రారంభించిన రోజునే ATS, TAS, SKI లాంటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్స్ రావడం గొప్ప విషయం అన్నారు. నిరంతరం కష్టపడే గర్రెపల్లి సతీష్ చిన్న వాడు అయినా రాష్ట్రంలో ఎంతో మంది నాయకులతో ఎప్పుడు టచ్ లో ఉంటూ తనకంటూ మంచి పేరు సంపాదించుకున్నాడు ఇప్పటి నుండి సతీష్ వెనకాల ఏ రకంగా అయినా మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పడం జరిగింది.
ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ డిజిటల్ మీడియా ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది అని ఇలా కంపెనీ స్థాపించి కొంత మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అభినందనీయం అని MDS టీం అందరికి గుడ్ లక్ చెప్పడం జరిగింది. గర్రెపల్లి సతీష్ మాట్లాడుతూ సంతోష్ కుమార్ రావడమే MDS కి ఒక మంచి శుభసూచకం అని డిజిటల్ మీడియా మరియు సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ మంచి కార్యక్రమాలను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాయని అదేవిధంగా MDS అనే కంపెనీ మార్కటింగ్ రంగంలో కార్పొరేట్ కంపెనీలకు మంచి లీడ్స్ తీసుకొస్తూ క్లైంట్స్ ని పెంచే దిశలో ముందుకు సాగుతుందని అన్నారు.
రాఘవ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ మాట్లాడుతూ పెద్ద ఎత్తున ఉద్యమం లాగా గ్రీన్ చాలేంజ్ కొనసాగుతుంది యంపి సంతోష్ కుమార్ గారి ఇచ్చిన స్పూర్తి తో ముందుకు వెళ్లతున్నాము. పర్యావరణ రక్షించుకోవల్సి బాధ్యత మన మీద ఉందన్నారు..
జోగిన పల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ MDS కంపెనీ US లో ఉన్న SKI internation pvt ltd కంపెనీ CEO కిషన్ కి మరియు వారి అఫీస్ టీమ్ అందరికి గ్రీన్ ఛాలెంజ్ వేసిన గర్రెపల్లి సతీష్. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తూ అందరి చేతుల మీదుగా సంతోష్ కుమార్ కి సన్మానము చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.