టి-సాట్ సీఈవో (టి.సాట్-సాఫ్ట్ నెట్) టి-సాట్ నెట్వర్క్ ఛానళ్ల సీఈవో ఆర్. శైలేష్ రెడ్డి శుక్రవారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తన కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’ లో భాగంగా జూబ్లీహిల్స్ లోని టి-సాట్ కార్యాలయ ఆవరణలో రెండు మామిడి మొక్కలతో పాటు, ఏడాకుల మొక్కలను సిబ్బందితో కలిసి నాటారు. ఈ సందర్భంగా శైలేష్ రెడ్డి మాట్లాడుతూ.. గత నాలుగు సంవత్సరాల క్రితం కార్యాలయ ఆవరణ అంతా ఏడారిగా ఉండేదన్నారు.
ప్రస్తుతం పచ్చదనంతో ఆహ్లాదకరంగా మారిందన్నారు. నగరంలో పొల్యూషన్ ప్రభావాన్ని ఎదుర్కొని టి-సాట్ కార్యాలయానికి వచ్చి ఆరోగ్యవంతమైన ఆక్సిజన్ పొందడంతో పాటు ఆహ్లాదకర వాతావరణాన్ని ఆస్వాదించవచ్చని గుర్తు చేశారు. ఈ పచ్చదనాన్ని ఇలాగే కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.