రంగారెడ్డి ఫ్లైవుడ్‌ పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం

రంగారెడ్డి జిల్లాలోని నందిగామ ఫ్లైవుడ్‌ పరిశ్రమలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఫ్లైవుడ్‌ కావడంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని జేసీబీతో పరిశ్రమ గోడలు బద్దలు కొట్టి మంటలు అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు. అయితే, అగ్ని ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.