సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాల‌తో మంత్రి కేటీఆర్ భేటీ

సూర్యాపేట జిల్లా హుజూర్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న సిమెంట్ ప‌రిశ్ర‌మ‌ల యాజ‌మాన్యాల‌తో స్థానిక ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డితో క‌లిసి రాష్ట్ర ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి కేటీఆర్ గురువారం స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా సిమెంట్ పరిశ్రమల్లో 70 శాతం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు స్థానికులకు కల్పించాలని యాజమాన్యాలను మంత్రి కోరారు. స్థానికులకు ఎక్కువగా ఉపాధి కల్పించే కంపెనీలకు నూతన పారిశ్రామిక పాలసీ కింద ప్రోత్సాహకాలు, పన్ను మినహాయింపు ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా హుజూర్‌న‌గ‌ర్‌లో నైపుణ్య శిక్ష‌ణ కేంద్రం ఏర్పాటుకు హామీ ఇచ్చారు.