త‌న బ‌ర్త్‌డే రోజు అభిమానులు మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చిన మ‌హేష్‌

టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ కొంత కాలం క్రితం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి ఎంత పెద్ద రెస్పాన్స్ వచ్చిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. సెలబ్రిటీలు, ప్ర‌ముఖులు వివిధ వర్గాల ప్రజలు పచ్చదనం ఆవశ్యకతప గురించి తెలియజేస్తున్న క్ర‌మంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశేష ఆదరణ పొందుతుంది. తాజాగా మ‌హేష్ బాబు త‌న సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌జ‌లంద‌రిని ఓ కోరిక కోరాడు.

ప్ర‌తి ఒక్కరు త‌న బ‌ర్త్‌డే రోజు మూడు చెట్లు నాటాల‌ని స్ప‌ష్టం చేశాడు. నామీద ఉన్న ప్రేమతో మీరు చేసే పనులన్ని నాకు ఎంతగానో ఇన్స్పిరేషన్‌ని కలిగిస్తున్నాయి.అందుకే ఈ బ‌ర్త్ డే రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ని స‌పోర్ట్ చేస్తూ ప్ర‌తి ఒక్కు మూడు మొక్క‌లు నాటాల‌ని చెప్పాడు. ప్ర‌కృతిని స‌మ‌తుల్యంగా ఉంచ‌డంతో పాటు కాలుష్యాన్ని త‌గ్గించేందుకు చెట్లు త‌ప్పనిస‌రిగా నాటాల‌ని మ‌హేష్ పిలుపునిచ్చారు. మొక్కలు నాటే ఫోటోలను షేర్ చేస్తూ నన్ను ట్యాగ్ చేయండి. అప్పుడే నేను చూడగలను అని పేర్కొన్నారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు స‌ర్కారు వారి పాట చిత్రంతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.

మ‌హేష్ గ‌తంలోను మొక్క‌లు నాటాల‌ని పిలుపునిచ్చిన విష‌యం తెలిసిందే. సీఎం కేసీఆర్ బర్త్ డే రోజున అందరూ మొక్కలు నాటాలని మహేష్ బాబు పిలుపునివ్వ‌గా, ఆ రోజు మహేష్ బాబుతో పాటు ఆయన పిల్లలు గౌతమ్, సితార కూడా మొక్కలు నాటారు. గ్లోబల్ వార్మింగ్ తగ్గాలంటే మొక్కలను పెంచడమే మనకు ఉన్న ఏకైక పరిష్కారమని ఆయన అన్నారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ద్వారా గ్లోబల్ వార్మింగ్ ప్రమాదకర స్థాయికి చేరకుండా పరిమితం చేయవచ్చని తెలిపారు