గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్‌

తెలంగాణలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు.. ఆదివారం ఉదయం ప్రగతి భవన్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. ఆపై సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లోని సైనిక వీరుల స్మారకం వద్ద పుష్పగుచ్చం సమర్పించి అమరులకు నివాళి అర్పించారు. అటునుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేదికైన గోల్కొండ కోటకు చేరుకున్నారు.

గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించి.. అటుపై సాయుధ దళాల నుంచి గౌరవ వందనం అందుకున్నారు ఆయన. అనంతరం కోటలోని రాణిమహల్ ప్రాంగణం నుంచి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.