రేపు తూర్పుగోదావరి జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(సోమవారం) తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. రెండో విడత నాడు-నేడు పనులకు సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టనున్నారు. పి.గన్నవరం మండలం పోతవరం జడ్పీ హైస్కూల్‌లో నిర్వహించే కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. జగనన్న విద్యాకానుక కింద పిల్లలకు  సీఎం జగన్ కిట్లు పంపిణీ చేయనున్నారు.