మహారాష్ట్ర నుంచి గోదావరి మీదుగా అక్రమంగా టేకు కలపను జిల్లాలోని మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి కొంతమంది వ్యక్తులు తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. దీంతో సుమారు 1.80 లక్షల విలువగల టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారని అటవీశాఖ అధికారులు పేర్కొన్నారు.
ఈ దాడుల్లో మహదేవపూర్ రేంజర్ కమల, పలుగుల బీట్ ఆఫీసర్ తాజోద్దీన్, ఎస్‌బీవో స్రవంతి, అన్నారం సెక్షన్ ఆఫీసర్ మమతతో పాటు మహదేవపూర్, పెగడపల్లి బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.