గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్క‌లు నాటిన ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శ‌శిథ‌రూర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఐటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శశిథరూర్ నేతృత్వంలోని సభ్యులు శిల్పారామంలోని రాక్ హైట్స్ లో మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్‌ను శశిథరూర్ ప్రత్యేకంగా అభినందించారు.

ఈ సంద‌ర్భంగా శ‌శిథ‌రూర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. గ్లోబల్ వార్మింగ్‌ను అరికట్టాలంటే ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా పర్యావరణానికి మేలు కలిగించేందుకు మొక్కలు నాటే అవకాశం లభించినందుకు శశిథరూర్ సంతోషం వ్యక్తం చేశారు.

గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకెళ్తుంద‌ని ఎంపీలు రంజిత్ రెడ్డి, సయ్యద్ జాఫర్ ఇస్లాం అన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని పర్యావరణానికి మేలు కలిగేలా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు. హైదరాబాద్ పర్యటనలో భాగంగా సహచర ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని సయ్యద్ జాఫర్ ఇస్లాం అన్నారు. సీఎం కేసీఆర్ హరిత హారం స్పూర్తితో గ్రీన్ ఇండియా చాలెంజ్ ముందుకెళ్తుందని 16 కోట్లకు పైగా ఇప్పటివరకు మొక్కలు నాటడం జరిగిందని ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు.