సీఎం కేసీఆర్‌, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అభినందనలు : మంత్రి హరీష్‌ రావు

మున్సిపాలిటీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అఖండ విజయం సాధించినందుకు సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు మంత్రి హరీష్‌రావు అభినందనలు తెలిపారు. ఈ మేరకు హరీష్‌రావు ట్వీట్‌ చేశారు. ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టీఆర్‌ఎస్‌దేనని తెలంగాణ ప్రజలు మరోసారి రుజువు చేశారని పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ ప్రభంజనమే వీసిందన్నారు. ప్రత్యర్థులు అందుకోలేని స్థాయిలో టీఆర్‌ఎస్‌ పార్టీకి తిరుగులేని ఫలితాలు అందించారు. ఈ విజయానికి కష్టపడిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులకు, మరీ ముఖ్యంగా కార్యకర్తలకు మంత్రి హరీష్‌ రావు అభినందనలు తెలిపారు. బంగారు తెలంగాణ సాధన కేసీఆర్‌ సారధ్యంలోని ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీకే సాధ్యమని చాటిచెప్పిన తెలంగాణ ప్రజానీకానికి మనఃపూర్వక కృతజ్ఞతలు తెలిపారు మంత్రి హరీష్‌రావు.

ఎన్నికలు ఏవైనా గెలుపు మాత్రం టిఆర్ఎస్ దేనని మరోసారి రుజువు చేశారు తెలంగాణ ప్రజలు. మునిసిపల్ ఎన్నికల్లోనూ టిఆర్ఎస్ ప్రభంజనమే వీసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అభినందనలు.