ద‌ళిత‌బంధు ప‌థ‌కంపై సీఎం కేసీఆర్ స‌మీక్ష‌

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన ద‌ళిత‌బంధు ప‌థ‌కం అమ‌లుపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో స‌మీక్ష నిర్వ‌హించారు. సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, కామారెడ్డి జిల్లాలో ఎంపికచేసిన మండలాల్లో దళితబంధు పథకం అమలుపై సీఎం కేసీఆర్ స‌మీక్షిస్తున్నారు.

ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో జ‌రుగుతున్న ఈ స‌మావేశానికి ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, పువ్వాడ అజయ్‌, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, సీఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్‌, హన్మంత్‌షిండే, నాలుగు జిల్లాల కలెక్టర్లు, జడ్పీ చైర్మన్లు, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, సీఎంవో కార్యదర్శి రాహుల్‌బొజ్జా, కరీంనగర్‌ కలెక్టర్‌ కర్ణన్ హాజ‌ర‌య్యారు.

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి, నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ, కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలోని నిజాంసాగర్‌ మండలాలను దళితబంధు కోసం ఎంపికచేసిన విషయం తెలిసిందే.