
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి భారీ విజయాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు టీఆర్‌ఎస్ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ తరపున విజయం సాధించిన అభ్యర్థులకు ఆమె శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం కష్టపడిన ప్రతి టీఆర్‌ఎస్ కార్యకర్తకు కవిత అభినందనలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది.