ఈ నెల 16న తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం

తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఈ నెల 16న జరుగనున్నది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 2న సమావేశం జరుగనున్నది. శాసనసభ సమావేశాల నిర్వహణతో పాటు దళితబంధు పైలెట్‌ ప్రాజెక్టు అమలుపై మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం హుజూరాబాద్‌తో పాటు వాసాలమర్రిలో పైలెట్‌ ప్రాజెక్టు కింద అమలు చేస్తున్నది. మరో నాలుగు గ్రామాల్లోనూ పైలెట్‌ ప్రాజెక్టును అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ మేరకు సోమవారం కార్యక్రమం ఉన్నతస్థాయి సమీక్ష సైతం నిర్వహించారు. మంత్రివర్గ సమావేశంలో పథకం అమలుపై పూర్తిస్థాయిలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.