గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటిన దర్శనం మొగులయ్య

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమంలో పాల్గొని 12 మెట్ల కిన్నెర కళాకారుడు దర్శనం మొగులయ్య మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా బుధవారం సైదాబాద్ సింగరేణి కాలనిలో తన నివాసం వద్ద మొక్కలు నాటారు.

సీఎం కేసీఆర్ హరితహారం స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా ఛాలెంజ్‌లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని మొగులయ్య పిలుపునిచ్చారు. దేశం పచ్చబడాలన్నా..వర్షాలు కురవాలన్నా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు.