సూర్యాపేట కర్నాలకుంట చెరువు ఆక్రమణపై ఎన్జీటీలో విచారణ

సూర్యాపేట జిల్లా కర్నాలకుంట చెరువు ఆక్రమణపై చెన్నై ఎన్జీటీలో విచారణ జరిగింది. చెరువును ఆక్రమణ చేసి రియల్‌ఎస్టేట్ వెంచర్లు చేస్తున్నారని ఎన్జీటీలో పిటిషన్‌ దాఖలయింది. సూర్యాపేట కలెక్టర్, టీఎస్ పీసీబీ, చిన్న నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్, రెండు రియల్ఎస్టేట్ సంస్థలకు ఎన్జీటీ నోటీసులు జారీ చేసింది. వాస్తవ పరిస్థితిని పరిశీలించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసింది. కమిటీ సభ్యులుగా కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ అధికారి, టీఎస్ పీసీబీ , సూర్యాపేట కలెక్టర్, రాష్ట్ర పర్యావరణ సంస్థ, ఇరిగేషన్ శాఖ ఎస్‌ఈలను నియమించింది. తదుపరి విచారణను అక్టోబర్ 26కు ఎన్జీటీ వాయిదా వేసింది.