నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు : రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌

గణేశ్‌ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. ఈ నెల 19న ఆదివారం నిమజ్జన వేడుకలు జరుగనుండగా.. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సరూర్‌నగర్‌, మన్సూరాబాద్‌, నాగోల్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌, ఇనాంగూడ, తుర్కయాంజల్‌, ఇంజాపూర్‌, జల్‌పల్లి, ఉప్పల్‌ నల్ల చెరువు, మల్కాజ్‌గిరి సఫీల్‌గూడ, కాప్రా చర్లపల్లి, చౌటుప్పల్‌ సంగమ్‌, భునగిరి, బీబీనగర్‌ చెరువుల్లో విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ వివరించారు.