పంచాయతీరాజ్ శాఖ పలు ఖాళీల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. స్పోర్ట్స్ కోటాలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టుల భర్తీకి లేటెస్టుగా నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 172 ఖాళీలను ప్రకటించింది. ఈ పోస్టులకు 2021 సెప్టెంబర్ 18న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకునేందుకుచివరి తేదీ 2021 అక్టోబర్ 10 . ఇవి స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు కావడంతో విద్యార్హతలతో పాటు పలు క్రీడల్లో రాణించి ఉండాలి.
అర్హతలు: డిగ్రీ పాస్, స్పోర్ట్స్ కోటా గైడ్‌లైన్స్ పూర్తి చేయాలి.
ఏజ్ లిమిట్: 18 నుంచి 44 ఏళ్లు.
పరీక్షా విధానం: 100 మార్కులకు ఒకటి చొప్పున 2 పేపర్లు ఉంటాయి. ఒక్కో దాంట్లో 35 మార్కులు వస్తే క్వాలిఫై అవుతారు.