పర్యావరణ కాలుష్యం పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితులలో ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఆదాయపు పన్ను శాఖ ప్రధాన కమిషనర్ అతుల్ ప్రణయ్ అన్నారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా ‘ప్రదూషన్ సే ఆజాదీ’ కార్యక్రమం ద్వారా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను విభాగం ఆధ్వర్యంలో ఇప్పటివరకు 5వేల మొక్కలను నాటామన్నారు. శనివారం ఐటీ భవనం వద్ద, దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో, బంజారాహిల్స్‌లోని ఆదాయపు పన్ను అధికారుల నివాసప్రాంగణంలో అటవీ అధికారులు, పర్యావరణవేత్తలతో కలిసి ఐటీ అధికారులు మొక్కలను నాటారు.
