ఏసీబీకి చిక్కిన సీనియ‌ర్ అసిస్టెంట్, కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్

జీహెచ్ఎంసీ కూక‌ట్‌ప‌ల్లి స‌ర్కిల్ కార్యాల‌యంలో గురువారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు. రూ. 8 వేలు తీసుకుంటుండ‌గా సీనియ‌ర్ అసిస్టెంట్ చాంద్ పాషాను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మ్యూటేష‌న్ కోసం చాంద్ పాషా లంచం డిమాండ్ చేయ‌డంతో, బాధిత వ్య‌క్తి ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించాడు.

అయితే ఏసీబీ అధికారులు అక్క‌డ ఉన్న స‌మ‌యంలో కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ కూడా ట్రేడ్ లైసెన్స్ కోసం లంచం తీసుకుంటూ ప‌ట్టుబ‌డ్డాడు. రూ. 2,500 లంచం తీసుకున్న కంప్యూట‌ర్ ఆప‌రేట‌ర్ ష‌ణ్ముగంను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కూక‌ట్‌ప‌ల్లి స‌ర్కిల్ ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు.