భారీ వర్షాల నేపథ్యంలో నేడు తెలంగాణలో సెలవు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు రోజులూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు మంగళవారం సెలవు ప్రకటించింది. భారీ వర్షాలపై సమీక్ష సందర్భంగా సెలవు అంశంపై నిర్ణయం తీసుకోవాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్‌ సూచించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే రెవెన్యూ, పోలీస్, ఫైర్‌ సర్వీసులు, మున్సిపల్, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు, భవనాల శాఖలు, ఇతర అత్యవసర సర్వీసుల ఉద్యోగులు మాత్రం విధి నిర్వహణలో ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.