మదర్ డైయిరీ చైర్మన్‌గా గంగుల కృష్ణారెడ్డి

నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తి దారుల సహాయక సహకార యూనియన్ చైర్మన్‌గా గంగుల కృష్ణారెడ్డిని బోర్డు డైరెక్టర్లు ఎన్నుకున్నారు. హయత్‌నగర్‌లోని మదర్ డెయిరీ ప్రాంగణంలో మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో బోర్డు డైరెక్టర్లు సమావేశమయ్యారు. బోర్డు డైరెక్టర్ల సమావేశంలో గంగుల కృష్ణారెడ్డి బాధ్యతలు స్వీకరించారు.

అంతకుముందు నార్ముల్ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు. కాగా, నూతన బోర్డు డైరెక్టర్ల బృందం నిన్న మంత్రి కేటీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ మేరకు మంత్రి వారికి అభినందనలు తెలిపారు.

కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిశోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, కంచర్ల భూపాల్ రెడ్డి, రవీందర్ కుమార్, పైళ్ల శేఖర్ రెడ్డి, శానంపూడి సైదిరెడ్డి, నార్ముల్ తాజా మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.