గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా జమ్మి మొక్కలు నాటిన ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి

గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘ఊరు ఊరికో జమ్మి చెట్టు.. గుడి గుడికో జమ్మి చెట్టుకు విశేష స్పందన లభిస్తున్నది. ఎంపీ పిలుపు మేరకు దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జమ్మి మొక్కలును నాటారు. తన పుట్టినరోజును పురస్కరించుకొని జిల్లా భూత్పూర్ శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శివాలయ ఆవరణలో జమ్మి మొక్కలు నాటారు.

పచ్చదనం పెంచడం కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ కు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే ఆల పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలు, దేవాలయాలు, పాఠశాలలలో 500 జమ్మి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.