హరిత నిధి ఏర్పాటు హర్షణీయం : అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

హరిత నిధి ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ శాసన సభలో ప్రకటించిన నేపథ్యంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హరిత నిధి ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతను గుర్తు చేయడంతో పాటు , ప్రజల భాగస్వామ్యం పెరుగుతుందన్నారు.

హరిత నిధి ఏర్పాటుకు అన్ని పార్టీల సభ్యులు ముక్తకంఠంతో స్వాగతించడం పట్ల వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధి ఏర్పాటుతో తెలంగాణకు హరితహార కార్యక్రమ నిర్వహణ మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.

తెలంగాణకు హరితహారం కార్యక్రమం నిరంతరాయంగా సాగేందుకు హరిత నిధిని ఏర్పాటు చేయడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలుపుతున్న అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, సి.ఎస్ సోమేశ్ కుమార్, సిఎం సెక్రటరీ భూపాల్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (అటవీశాఖ) శాంతి కుమారి, పిసీసీఎఫ్ ఆర్.శోభ, సిఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్ తదితర అటవీశాఖ ఉన్నతాధికారులు.