గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో జమ్మి మొక్కలు నాటిన ఎమ్మెల్యే అజ్మీరా రేఖా శ్యామ్‌ నాయక్‌, విజయ డెయిరీ చైర్మన్‌ లోక భూమారెడ్డి

బొల్లారం అయ్యప్ప స్వామి దేవాలయంలో ఖాతాపూర్‌ ఎమ్మెల్మే అజ్మీరా రేఖా శ్యామ్‌ నాయక్‌, రాష్ట్ర విజయ డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి జమ్మి మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మిని ప్రతీ ఊరిలో, ప్రతీ గుడిలో పెంచాలనే ఉద్దేశంతో ఎంపీ సంతోష్‌కుమార్‌ మరో వినూత్న కార్యక్రమం చేపట్టారన్నారు. రానున్న దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఊరుఊరుకో జమ్మిచెట్టు – గుడిగుడికో జమ్మి చెట్టు కార్యక్రమం మొదలవుతుందన్నారు. కార్యక్రమానికి 20వేలకుపైగా జమ్మి మొక్కలను సిద్ధం చేస్తున్నారని, అన్ని గ్రామాలు, ఆలయాలకు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.