గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మణుగూరు మండలంలోని excellent స్కూల్లో విద్యార్థులు మొక్కలు నాటడం జరిగింది

71 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి మానసపుత్రిక హరితహారం లో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో ఈరోజు మణుగూరు మండలంలోని ఎక్సలెంట్ స్కూల్లో విద్యార్థులు మొక్కలు నాటడం జరిగింది అలాగే స్కూల్ కరస్పాండెంట్ మొహమ్మద్ యాకుబ్ షరీఫ్ గారు మాట్లాడుతూ మన పెద్దలు చెప్పినట్టు గాలిని , నీరుని కొనుక్కునే దౌర్భాగ్య పరిస్థితి వస్తుందని అన్నారో ఆ విధంగానే మన దేశ రాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేశారు కాబట్టి ఈ దుస్థితి భావితరాలకు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరం ఈ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటవలసిన అవసరం ఎంతైనా ఉంది కనుక ప్రతి ఒక్క విద్యార్థి మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేయాలని ఆయన అన్నారు