ఏసీబీ వలలో నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్ తహసీల్దార్‌ షౌకత్ అలీ

నాగర్‌కర్నూల్‌ జిల్లాలోని కొల్లాపూర్‌లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. రూ. 12వేలు లంచం తీసుకుంటూ కొల్లాపూర్ తహసీల్దార్ షౌకత్ అలీ, వీఆర్ఏ స్వామి, కంప్యూటర్ ఆపరేటర్ శివ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

వివరాలు ఇలా ఉన్నాయి. కుడికిళ్ల గ్రామానికి చెందిన రైతు బంగారు స్వామి తన చెల్లెలికి నార్లాపూర్ శివారులో ఉన్న సర్వే నంబర్ 305 లో 5.20 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ కోసం 7 డ్యాకుమెంట్లకు స్లాట్ బుక్కు చేరుకున్నారు. అయితే ఇందుకు ఒక్కొక్క దానికి రూ.2, 500 వీఆర్ఏ, కంప్యూటర్ ఆపరేటర్ స్వామిని డబ్బులు అడిగారు.

ఇదే విషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా మాకు ఖర్చులు ఉంటాయని చెప్పినట్లు తెలిసింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారుల సూచనల మేరకు డబ్బులు అందజేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

తహసీల్దార్‌ చెబితేనే తాము డబ్బులు తీ సుకున్నట్లు వీఆర్‌ఏ, కంప్యూటర్‌ ఆపరేటర్‌ వాంగ్మూలమిచ్చారు. దీంతో తహసీల్దార్‌ను కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.