జీహెచ్ఎంసీ ప‌రిధిలో జోన‌ల్ క‌మిష‌న‌ర్లు బదిలీ

జీహెచ్ఎంసీ ప‌రిధిలో ప‌లువురు జోన‌ల్ క‌మిష‌న‌ర్లు బ‌దిలీ అయ్యారు. ఈ మేర‌కు మున్సిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ అండ్ అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగం ఉత్త‌ర్వులు జారీ చేసింది. శేరిలింగంప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా ప‌ని చేస్తున్న ఎన్ ర‌వి కిర‌ణ్ ఖైర‌తాబాద్ జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యారు. జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్‌గా విధులు నిర్వ‌ర్తిస్తున్న ప్రియాంక ఆల శేరిలింగంప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా నియామ‌కం అయ్యారు.

కూక‌ట్‌ప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్ వి మ‌మ‌త ఎల్బీన‌గ‌ర్ జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా నియామ‌కం అయ్యారు. జీహెచ్ఎంసీ అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్‌గా కొన‌సాగుతున్న ఎస్ పంక‌జ కూక‌ట్‌ప‌ల్లి జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీ అయ్యారు. ఎల్బీన‌గ‌ర్ జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా కొన‌సాగుతున్న ఆర్ ఉపేంద‌ర్ రెడ్డి న‌ల్ల‌గొండ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా బ‌దిలీ అయ్యారు.