ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలకు పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో వీటికి నవంబర్‌ 9న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నవంబర్‌ 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 17న పరిశీలన జరగనుంది. 22న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్‌ 29న పోలింగ్‌ నిర్వహించి, అదే రోజు కౌంటింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నారు. 

ఏపీలో సోము వీర్రాజు, చిన్న గోవిందరెడ్డి, మహ్మద్‌ షరీఫ్‌ పదవీకాలం మే 31 నాటికి ముగిసింది. తెలంగాణలో ఆకుల లలిత, మహ్మద్‌ ఫరూద్దీన్‌, గుత్తా సుఖేందర్‌ రెడ్డి, నేతి విద్యాసాగర్‌, వెంకేటశ్వర్లు, కడియం శ్రీహరి పదవీకాలం జూన్‌ 3నాటికి ముగిసింది.