ఇవాళ కరీంనగర్‌ కర్పోరేషన్ ఫలితాలు

ఇవాళ కరీంనగర్‌ నగరపాలక సంస్థ ఓట్ల లెక్కింపును ఈసీ చేపట్టనుంది. పట్టణంలోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ ఓట్ల లెక్కింపు ప్రకియ జరుగనున్నది. ఉదయం 7 గంటలకు కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. కరీంనగర్‌ కార్పోరేషన్‌లోని 60 డివిజన్లకు గాను 2 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. 20, 37 డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థులు తుల రాజేశ్వరి, చల్లా స్వరూపారాణి ఎన్నిక ఏకగ్రీవమైంది. మిగితా 58 డివిజన్లకు పోలైన మొత్తం ఓట్లను లెక్కిస్తారు. భద్రతా కారణాల దృష్ట్యా కౌటింగ్ కేంద్రం వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియకు మొత్తం 58 టేబుళ్లు ఏర్పాటు చేశారు. మొత్త ౩ రౌండ్లలో ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇందుకు గానూ 58 మంది సూపర్‌వైజర్లు, ఇద్దరు చొప్పున అసిస్టెంట్లను ఈసీ నియమించింది. కౌంటింగ్‌ ప్రక్రియ కోసం 20 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడించనున్నారు. కాగా, కొన్ని అనివార్య కారణాల వల్ల కరీంనగర్‌ నగరపాలక సంస్థకు ఎన్నికలు 2 రోజులు ఆలస్యంగా నిర్వహించారు.