ఏసీబీకి చిక్కిన సంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ స‌ర్వే ఏడీ మ‌ధుసూద‌న్

సంగారెడ్డి జిల్లా ల్యాండ్ అండ్ స‌ర్వే ఏడీ మ‌ధుసూద‌న్, మ‌రో ఉద్యోగి అసిఫ్.. లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. భూమి స‌ర్వే కోసం ఓ మ‌హిళ వ‌ద్ద నుంచి ఏడీ మ‌ధుసూద‌న్ లంచం డిమాండ్ చేశారు. దీంతో బాధిత మ‌హిళ ఏసీబీ అధికారుల‌ను ఆశ్ర‌యించింది. ఈ క్ర‌మంలో సోమ‌వారం ఏడీ మ‌ధుసూద‌న్, అసిఫ్ క‌లిసి.. మ‌హిళ నుంచి లంచం తీసుకుంటుండ‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అనంత‌రం ఏడీ కార్యాల‌యంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వ‌హించారు.