హుజూరాబాద్ ఉప ఎన్నిక తొలి రౌండ్‌లో బీజేపీ ఆధిక్యం..

 హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. తొలి రౌండ్ ఫ‌లితాలు వెల్ల‌డి అయ్యాయి. తొలి రౌండ్‌లో బీజేపీ అభ్య‌ర్థి ఈట‌ల రాజేంద‌ర్ ఆధిక్యంలో ఉన్నారు. తొలి రౌండ్ పూర్త‌య్యేస‌రికి బీజేపీ 166 ఓట్ల ఆధిక్యంలో ఉంది. ఈట‌ల‌ రాజేంద‌ర్‌కు 4,610 ఓట్లు పోల‌వ్వ‌గా, గెల్లు శ్రీనివాస్ యాద‌వ్‌కు 4444 ఓట్లు, కాంగ్రెస్ అభ్య‌ర్థి వెంక‌ట్‌కు 119 ఓట్లు పోల‌య్యాయి.