ఈటల రాజేందర్ సొంత మండలంలో భారీగా మెజార్టీ

ఈటల రాజేందర్ సొంత మండలంలో బీజేపీ హవా కొనసాగుతోంది. కమలాపూర్ మండలంలో ప్రస్తుతం 19వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి అయింది. ఈ రౌండ్‌లోనూ ఈటల భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రౌండ్‌లో ఈటల రాజేందర్ 2, 869 ఓట్ల మెజారిటీ సాధించారు. 19వ రౌండ్‌లో బీజేపీకి 5,910 ఓట్లు రాగా టీఆర్ఎస్‌కు 2,869 ఓట్లు వచ్చాయి. మొత్తంగా ఇప్పటివరకూ ఈటల రాజేందర్‌ 91,306 ఓట్లతో ముందజలో కొనసాగుతున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 71, 771 వచ్చాయి. కమలాపూర్ మండలంలో 19 నుంచి 22 రౌండ్ల లెక్కింపు కొనసాగనుంది. ఈటల రాజేందర్ 19,535 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 

హుజూరాబాద్‌లో ఇప్పటివరకు నాలుగు మండలాల కౌంటింగ్ పూర్తి అయింది. నాలుగు మండలాల్లో ఈటలకు స్పష్టమైన ఆధిక్యం వచ్చింది. హుజూరాబాద్ 3186, వీణవంక 2505, జమ్మికుంట 4330, ఇల్లందకుంట 5011 ఓట్లు వచ్చాయి.