రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేప్పట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ఆదిలాబాద్ ఏ ఆర్ హెడ్ క్వాటర్స్ లో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అడవులు ఉండలిసిన ప్రాంతం 33% కానీ మన తెలంగాణా లో 23% మాత్రమే ఉంది మిగిలిన 10% అడవులు కావాలంటే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ బాగాస్వామ్యులు కావాలి . హైదరాబాద్ లాంటి మహానగరం చుట్టూ కొన్ని వేల ఎకరాల్లో పార్కులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముప్పై సంవత్సరాల తరువాత రాబోయే పర్యావరణ ఇబ్బందులను మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా పసిగట్టి పార్కులు ఏర్పాటు చేయడం, అడవులను పెంచడం ఆయన దూరద్రుష్టికి నిలువుటద్దం. కేసీఆర్ అడవుల నరికివేయడం అరికట్టేందుకు కఠినంగా వ్యవహరించాలని అధికారులతో పర్యవేక్షణ చేస్తూ, వారికి పూర్తి సహకారం అందించారు దీనికి తోడు పర్యావరణ పరిరక్షణకు ఎంపీ సంతోష్ కుమార్ చేస్తున్న కృషి అభినందనియం . మొక్కలు పెంచడంతో పాటు వాటి ఎదుగుదల పైన శ్రద్ద చూపడం చాలా ముఖ్యమైన విషయం. మొక్కలు పెట్టడం ఫోటోలకు పరిమితం కాకుండా వాటి ఫలితాలు పొందే విదంగా ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని కోరారు. తను వ్యక్తి గతంగా పర్యావరణ ప్రేమికుడని , తను (10000) పదివేల మొక్కలు నాటి (8000) ఎనిమిది వేల మొక్కలు ఎదిగేందుకు వాటిపైన చూపే ప్రత్యేక శ్రద్దే కారణం అన్నారు . దీనిలో భాగంగా మరి ముగ్గురికి ఉట్నూర్ ఏఎస్పీ శబరిష్ , పిఓ ఐటీడీఏ ఉట్నూర్ కృష్ణా ఆదిత్య , డీఏఫో ప్రభాకర్ రెడ్డి, ఆదిలాబాద్ మొక్కలు నాటాలని కోరారు.