తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో గురువారం రవీంద్రభారతిలో డాక్టర్ కొమ్మూరి ప్రసాద్ రచించిన పీహెచ్డీ సిద్ధాంత గ్రంధం “తెలుగు పద్య నాటక రంగంలో శ్రీ జీఎస్ఎస్ శాస్త్రి కృషి – ఒక పరిశీలన” గ్రంథావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కేవీ రమణాచారి, సాహితీవేత్త వోలేటి పార్వతీశం, పూర్వ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణలు తదితరులు విచ్చేశారు. అనంతరం రమణాచారి మాట్లాడుతూ కొమ్మూరి ప్రసాద్ రచించిన తెలుగు పద్యనాటక రంగంలో పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం రాయడం ఎంతో అభినందనీయమన్నారు. కార్యక్రమంలో శ్రీపాద కుమార శర్మ, ఆచార్య ఎం.విశ్వేశ్వర శాస్త్రి, డా.ఆర్.ప్రభాకర్‌రావు, మద్దాళి రఘురామ్ పాల్గొన్నారు.
