వాడపల్లి ఎస్ఐ విజయ్ కుమార్ సస్పెన్షన్‌

నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం వాడపల్లి ఎస్ఐ విజయ్ కుమార్‌ను సస్పెండ్ చేస్తూ ఐజీ ఎన్‌.శివశంకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వారం రోజుల క్రితం పోలీసు పెట్రోలింగ్ వాహనంలో తెలంగాణ నుంచి ఆంధ్రకు మద్యాన్ని తరలిస్తూ కానిస్టేబుల్ శ్రవణ్ కుమార్ పట్టుబడ్డాడు. ఈ విషయంలో ఎస్ఐని బాధ్యుడిని చేస్తూ సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.