గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటిన న‌టి పూజా హెగ్డే

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా న‌టి పూజా హెగ్డే ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్క‌లు నాటారు. టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూజా హెగ్డే స్వీక‌రించి, ఈ కార్య‌క్ర‌మంలో ఆమె పాల్గొన్నారు. పూజా హెగ్డే మొక్క‌లు నాటిన అనంత‌రం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్ష‌య్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

ఈ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉంది. ప్రకృతి, సమాజం పట్ల బాధ్యతతో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్య‌క్ర‌మం గ్లోబల్ వార్మింగ్‌ని అరికట్టడానికి దోహదపడుతుంది. భవిష్యత్ తరాల మనుగడకు అవకాశం కల్పిస్తుంది అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు బాధ్యతగా గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటాలని పూజా హెగ్డే పిలుపునిచ్చారు