నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా మంత్రి హరీశ్‌రావు

నాంపల్లి ఎగ్జిబిషన్‌ సొసైటీ అధ్యక్షుడిగా ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు ఎన్నికయ్యారు. సోమవారం ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగిన సొసైటీ సర్వసభ్య సమావేశంలో 2021-22 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సొసైటీ ఉపాధ్యక్షుడిగా డాక్టర్‌ బీ ప్రభాశంకర్‌, కార్యదర్శిగా ఆదిత్య మార్గం, సంయుక్త కార్యదర్శిగా ఎం చంద్రశేఖర్‌, కోశాధికారిగా ధీరజ్‌కుమార్‌ జైశ్వాల్‌, సభ్యులుగా మహ్మద్‌ ఫరీముద్దీన్‌, బీ పాపయ్య చక్రవర్తి, కే ప్రేమ్‌కుమార్‌రెడ్డి, సాజిత్‌ మహ్మద్‌ అహ్మద్‌, వనం సత్యేందర్‌, డాక్టర్‌ ఎం సురేశ్‌రాజ్‌, డాక్టర్‌ టీఎన్‌ వీ తిలక్‌ ఎన్నికయ్యారు.