ఆర్టీసీ మంగళవారం నిర్వహించనున్న రక్తదాన శిబిరాల్లో రక్తదాతలకు తిరుగు ప్రయాణం ఉచితమని ఎండీ సజ్జనార్ ప్రకటించారు. టీఎస్ ఆర్టీసీ, రెడ్ క్రాస్ సోసైటీ సంయుక్తంగా జేబీఎస్, ఎంజీబీఎ్‌సలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తునట్లు గ్రేటర్ ఆర్టీసీ ఈడీ వెంకటేశ్వర్లు తెలిపారు. జేబీఎ్‌సలో ఉదయం 9గంటలకు రక్తదాన శిబిరాన్ని టీఎ్‌సఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్‌రెడ్డి ప్రారంభించన్నట్లు ఈడీ తెలిపారు. ఎంజీబీఎ్‌సలో నిర్వహిస్తున్న రక్తదాన శిబిరంలో ముఖ్య అతిధిగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొననున్నారు.
