లంచం అడిగారా ? 1064కు కాల్‌ చేయండి

  • ఒక్క ఫోన్‌కాల్‌తో మీ సమస్య పరిష్కారం
  • నేటి నుంచి ఏసీబీ అవినీతి నిర్మూలన వారోత్సవాలు

ఏదైనా పనిమీద ప్రభుత్వ ఆఫీస్‌కు వెళితే అధికారులు లంచం డిమాండ్‌ చేశారా? ఆమ్యామ్యా కోసం విసిగిస్తున్నారా? 1064కు కాల్‌ చేసి మీ సమస్య చెప్పండి. లంచగొండుల భరతం పట్టేందుకు అవినీతి నిరోధక విభాగం వెంటనే రంగంలోకి దిగుతుంది. వీలైనంత త్వరగా మీ సమస్యకు పరిష్కారం చూపుతుంది. ఆ ఫోన్‌కాల్‌కు మీరు డబ్బులు చెల్లించాల్సిన పనికూడా ఏమీలేదు. 1064 అనేది టోల్‌ఫ్రీ నంబర్‌. ఎవరికి భయపడాల్సిన పనిలేకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చు. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అవినీతి వ్యతిరేక వారోత్సవాలు నిర్వహించేందుకు ఏసీబీ అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ వారోత్సవాల పోస్టర్‌ను ఏసీబీ డీజీ గోవింద్‌సింగ్‌ ఆవిష్కరించారు. కరపత్రాలు, వాల్‌పోస్టర్ల ద్వారా ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు. ప్రజలంతా ఈ వారోత్సవాల్లో భాగస్వాములై తమ పరిధిలో అవినీతిపై ఫిర్యాదులు చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని అవినీతి నిరోధకశాఖ కేంద్ర కార్యాలయంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.

వారోత్సవాల సందర్భంగా జిల్లాల వారీగా అధికారుల పేర్లు, ఫోన్‌ నంబర్లు మీ కోసం..