రోశయ్య మృతిపట్ల తెలంగాణ సీఎం కేసీఆర్‌ సంతాపం

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌ సంతాపం తెలిపారు. ఆర్థికశాఖ మంత్రిగా పలు పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని అన్నారు. సౌమ్యుడిగా, సహనశీలిగా రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారని గుర్తుచేసుకున్నారు. రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.