నల్లగొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

నల్లగొండ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.  కట్టంగూరు మండలం అయిటిపాముల వద్ద ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం శ్రీ రాఘవేంద్ర ఫెర్రో అల్లాయ్స్‌ పరిశ్రమలో రియాక్టర్లు పేలడంతో అగ్ని ప్రమాదానికి దారి తీసింది.

దాంతో పరిశ్రమలో భారీగా మంటలు ఎగసి పడ్డాయి. ఫైరింజన్ల సహాయంతో అగ్ని మాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. కాగా, ప్రాణం నష్టం, భారీగా ఆస్తి నష్టం తప్పినట్లు తెలుస్తోంది.