ఏసీబీకి చిక్కిన మేడిప‌ల్లి ఎస్ఐ యాదగిరి రాజు

మేడిప‌ల్లి ఎస్ఐ యాద‌గిరి రాజు ఏసీబీ అధికారుల‌కు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుబ‌డ్డాడు. ఓ కేసు విష‌యంలో రూ. 10 వేలు లంచం తీసుకుంటుండ‌గా యాద‌గిరి రాజును అధికారులు అదుపులోకి తీసుకున్నారు. బోడుప్ప‌ల్ అంబేద్క‌ర్ న‌గ‌ర్‌కు చెందిన న‌ల్లిక ప్ర‌శాంత్ వ‌ద్ద రూ. 10 వేలు లంచం తీసుకుంటున్న ఎస్ఐ యాద‌గిరిని అదుపులోకి తీసుకున్న‌ట్టు ఏసీబీ అధికారులు వెల్ల‌డించారు. యాదగిరిపై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

ప్ర‌భుత్వ అధికారులు ఎవ‌రైనా లంచం డిమాండ్ చేస్తే టోల్ ఫ్రీ నంబ‌ర్ 1064కు కాల్ చేయాల‌ని ఏసీబీ అధికారులు సూచించారు.