తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్‌ భేటీ

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంగళవారం భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి స్టాలిన్‌ నివాసానికి చేరుకున్న కేసీఆర్‌కు.. ఆయన పుష్పగుచ్ఛం అందించి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా దేశ రాజకీయాలపై ఇద్దరు సీఎంలు చర్చించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ స్టాలిన్‌ తనయుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌తో సమావేశం అయ్యారు.