అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డీజీగా అంజనీకుమార్‌

హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ను అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డీజీగా రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నగర పోలీసు కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ను నియమించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో భారీ ఎత్తున ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 11 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమించారు.