హైదరాబాద్ సీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్

హైదరాబాద్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత సీపీ అంజనీ కుమార్ నుంచి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. కాగా.. హైదరాబాద్‌ సీపీగా ఉన్న అంజనీ కుమార్‌కు ఏసీబీ చీఫ్‌ బాధ్యతలు అప్పగించింది. అడిషనల్‌ సీపీ(క్రైం) శిఖా గోయల్‌ ఏసీబీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. సిద్దిపేట కమిషనర్‌ గా ఉన్న జోయల్‌ డేవిడ్‌ను హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలోని వెస్ట్‌ జోన్‌ డీసీపీగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితం వరకు కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఆనంద్‌ను తిరిగి సొంత కేడర్‌కు పిలిపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత… కేంద్ర సర్వీసులకు డిప్యుటేషన్‌పై వెళ్లిన సీవీ ఆనంద్‌కు కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చిన తర్వాతే వెనక్కి వచ్చారు. కొద్ది రోజుల్లోనే హైదరాబాద్‌ కొత్వాల్‌గా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గతంలో ట్రాఫిక్‌ బాస్‌గా పని చేసిన సీవీ ఆనంద్‌కు హైదరాబాద్‌పై పూర్తి పట్టుంది. నగరంలో లేక్ పోలీస్‌ను ఆయనే ప్రారంభించారు.