తెలంగాణ అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) డైరెక్టర్‌గా షికా గోయెల్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. సుమారు నాలుగు సంవత్సరాలు ఖాళీగా ఉన్న ఏసీబీ డైరెక్టర్ పోస్టులో అదనపు డీజీ ర్యాంకు అధికారి షికా గోయెల్‌ను ప్రభుత్వం ఇటీవలి బదిలీల్లో నియమించిన విషయం తెలిసిందే. ఐజీ చారు సిన్హా 2017 ప్రారంభంలో ఏసీబీ డైరెక్టర్‌గా కొనసాగారు. ఆమె కేంద్ర సర్వీసులకు వెళ్లినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది.