పలు కార్పొరేషన్ల చైర్మన్ల బాధ్యతల స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్‌ చైర్మన్‌గా పాటిమీది జగన్‌ మోహన్‌ రావు, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గజ్జెల నగేశ్‌, మినరల్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మన్నె క్రిశాంక్‌ బాధ్యతలు స్వీకరించారు. ఆయా కార్పొరేషన్లకు వారిని ఇటీవలే సీఎం కేసీఆర్‌ చైర్మన్లుగా నియమించిన సంగతి తెలిసిందే. బుధవారం ఆయా కార్పొరేషన్ల చైర్మన్ల చాంబర్లలో జరిగిన బాధ్యతల స్వీకార కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, శ్రీనివా్‌సగౌడ్‌, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, మాధవరం కృష్ణారావు, మైనంపల్లి హన్మంతరావు తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.