గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్‌గా డాక్టర్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌

తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య నూతన చైర్మన్‌గా డాక్టర్‌ దూదిమెట్ల బాలరాజు యాదవ్‌ గురువారం బాధ్యతలు స్వీకరించారు. మాసాబ్‌ట్యాంకులోని సమాఖ్య కార్యాలయంలో జరిగిన బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రులు జి.జగదీశ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, వి.శ్రీనివాస్‌ గౌడ్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నేతలు హాజరై బాలరాజు యాదవ్‌ను అభినందించారు.