తెలంగాణ అసెంబ్లీ వెల్ఫేర్ ఆఫ్ వుమెన్, చిల్డ్రన్స్, ఓల్డేజ్ కమిటీ సమావేశం ఈనెల 5వ తేదీన జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ కమిటీ హాల్ లో ఉదయం 11.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో ప్రస్తుతం తెలంగాణలో అమలు జరుగుతున్న వివిధ డెవలప్ మెంట్ యాక్టివిటీస్ పై కబిటీలో చర్చించనున్నారు. ముఖ్యంగా మహిళా, శిశు, ఓల్డేజ్ సంక్షేమ పధకాలపై చర్చించనున్నారు.